హోరా హోరీ పోరులో భారత్ బ్యాటింగ్
హోరాహోరీ పోరుకు భారత జట్టు సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సిరీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోతూ వస్తుండడం, భారత బౌలింగ్ బలహీనంగా ఉండడంతో ఆసీస్ లక్ష్య ఛేదనకు మొగ్గు చూపింది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది.